కాళ్ల దగ్గర కూర్చుని పూజ చేస్తే తప్పేంటి.. ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన ప్రణీత సుభాష్.. !

Pranitha Subhash: "ఏం పిల్లో ఏం పిల్లడో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ప్రణీత సుభాష్..

Arun Chilukuri
Published on: 4 Aug 2022 4:55 PM IST
Actress Pranitha Subhash Gave Clarity on Sitting At Her Husbands Feet
X

కాళ్ల దగ్గర కూర్చుని పూజ చేస్తే తప్పేంటి.. ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన ప్రణీత సుభాష్.. !

Pranitha Subhash: "ఏం పిల్లో ఏం పిల్లడో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ప్రణీత సుభాష్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది ఆ తరువాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం వంటి సినిమాలలో కనిపించిన ప్రణీత ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న ప్రణీత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక ఫోటో వివాదాస్పదంగా మారింది.

ఆ ఫోటో లో అమావాస్య పూజ చేపట్టిన ప్రణీత తన భర్త పాదాలకు నమస్కరిస్తూ కనిపించింది. వివరాల్లోకి వెళితే భర్త ఆయుష్షు కోసం పెళ్లయిన వాళ్ళు, మంచి భర్త రావాలని పెళ్లి కానీ అమ్మాయిలు చేసే పూజ ఇది. ఒకవైపు స్త్రీ పురుష సమానత్వం లేదని కొందరు ఫైట్ చేస్తుంటే ఈమె మాత్రం భర్తకు పాద పూజ చేస్తూ ఇదే మా స్థానమని చెప్పకనే చెప్తోందని నెటిజన్లు విమర్శించారు. తాజాగా ఈ ట్రోల్స్ పై తనదైన శైలిలో ప్రణీత స్పందించింది.

"ప్రతి విషయానికి రెండు కోణాలుంటాయి. 90 శాతం జనాలు పాజిటివ్ గా స్పందిస్తారు కానీ మిగిలినవారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. వారి మాటలు నేను పట్టించుకోను. నటిగా గ్లామర్ ఫీల్డ్ లో ఉంటే సాంప్రదాయాలను ఆచారాలను ఎందుకు పాటించకూడదా? నా సిస్టర్స్, స్నేహితులు, ఇరుగుపొరుగు వాళ్ళు అందరూ ఈ పూజ చేశారు. గతేడాది కూడా నేను ఈ పూజ చేశాను కానీ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేయలేదు. ఇది నాకు కొత్తేం కాదు. నేనెప్పుడూ పద్ధతి గల అమ్మాయిలాగానే నడుచుకుంటాను. మన సంప్రదాయాలు, విలువలు, పూజలను గౌరవిస్తాను. మోడ్రన్ గా ఆలోచించడమంటే మనం వచ్చిన దారిని మర్చిపోవడం కాదు'' అని ఘాటుగా రియాక్ట్ అయ్యింది ప్రణీత.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story