Pranitha Marriage: బిజినెస్‌మెన్‌తో ఘనంగా ప్రణీత వివాహం

హీరోయిన్‌ ప్రణీత పెళ్లీపీటలు ఎక్కింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకున్నారు.

Venkata Chari
Published on: 31 May 2021 4:31 PM IST
Actress Pranitha Got Married to a Businessman | Tollywood Latest News
X

ఘనంగా ప్రణీత వివాహం (ఫొటో ట్విట్టర్)

Pranitha Marriage: ఎట్టకేలకు హీరోయిన్‌ ప్రణీత పెళ్లీపీటలు ఎక్కింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకున్నారు. 'అత్తారింటికి దారేది'లో తన గ్లామర్‌తో తెలుగువారికి ఎంతో చేరువైంది ఈ ముద్దుగుమ్మ. కరోనా నేపథ్యంలో కొద్దిమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదివారం హీరోయిన్‌ ప్రణీత వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు #PranithaSubhash హ్యాష్ టాగ్‌తో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

'ఏం పిల్లో ఏం పిల్లడో', 'బావ' సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రణీత. 'అత్తారింటికి దారేది', 'రభస', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'బ్రహ్మోత్సవం', 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాలతో పాటు మరెన్నో సినిమాల్లో నటించింది. చాలావరకు సెకండ్ హీరోయిన్‌గానే నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీ 'హంగామా-2'లో నటిస్తున్నారు.


Venkata Chari

Venkata Chari

Next Story