Pragya Jaiswal : సాహ‌సాలతో వావ్ అనిపిస్తున్న కంచే భామ!

Pragya Jaiswal : సాహ‌సాలతో వావ్ అనిపిస్తున్న కంచే భామ!
x

Pragya Jaiswal

Highlights

Pragya Jaiswal : వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..

Pragya Jaiswal : వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. మొదటి సినిమాతోనే అటు అందం ఇటు అభినయంతో మెప్పించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఈ భామ.. అయితే ఆ తర్వాత ఆమె చేసిన గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్ లతో ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది ఈ భామ..

అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో అలరిస్తుంటుంది ఈ భామ.. తాజాగా రిహార్సల్‌లో భాగంగా చేసిన వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు తమ చేతుల పైన నిలబెట్టి ఉంచారు.. ఆమె కూడా ఎలాంటి భయం లేకుండా ఉంది. ఈ వీడియో నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ పోస్ట్ కి యాబై వేల లైకులు వచ్చాయి. అంటూ ఆమె సాహసానికి నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు.

ఇక ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తుందని తెలుస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ కి 27వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎఎం రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపధ్యంలో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. మరి ఈ సినిమా అయిన ప్రగ్యా జైస్వాల్ కి మంచి పేరుని తీసుకు వస్తుందో లేదో చూడాలి మరి!


Show Full Article
Print Article
Next Story
More Stories