"ఎఫ్3 కథే నాకు తెలియదు" అంటున్న ప్రగతి

*"ఎఫ్3 కథే నాకు తెలియదు" అంటున్న ప్రగతి

Rama Rao
Published on: 16 May 2022 11:50 AM IST
Actress Pragathi Comments about his Role in F3 Movie | Tollywood News
X

"ఎఫ్3 కథే నాకు తెలియదు" అంటున్న ప్రగతి

Pragathi: వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా గా వచ్చిన 'ఎఫ్2' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా "ఎఫ్3" త్వరలో తెరకెక్కనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో తమన్నా మరియు మేహారీన్ లు హీరయిన్లుగా నటిస్తున్నారు. ప్రగతి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మొట్టమొదటిసారిగా "ఎఫ్2" సినిమాలోనే ప్రగతిలో ఓ రేంజ్ కామెడీ యాంగిల్ ఉందని చూపించింది. ఇప్పుడు "ఎఫ్3" లో ఆమె పాత్ర పై అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఎఫ్3" కథే తెలీదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రగతి. "ఎఫ్2 లో 50 శాతం వినోదం ఉంటే ఎఫ్ 3 లో 100 శాతం వినోదం ఉంటుంది. ఈ సినిమాలో కూడా నా పాత్రని చాలా బాగా డిజైన్ చేశారు.

ఇందులో నా పాత్ర కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. ఎఫ్3 కథ గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. నాకు అంత సీన్ లేదు. ఈ చిత్రం కథ నాకు తెలీదు. దర్శకుడు చెప్పలేదు. కేవలం నా పాత్ర వరకే చెప్పారు" అని ప్రగతి చెప్పుకొచ్చింది. ఇక వరుణ్ తేజ్ క్విక్ లెర్నర్ అని ఏదైనా చూడగానే, వినగానే పసిగడతారు అని చెప్పిన ప్రగతి వెంక‌టేష్‌ సెట్‌లోకి రావడమే యాక్ష‌న్ మూడులోకి వెళ్ళిపోతారు అని అంటోంది.

Rama Rao

Rama Rao

Next Story