Heroine Poorna: ఒక్క ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టిన పూర్ణ..

Heroine Poorna: "శ్రీ మహాలక్ష్మి" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పూర్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Arun Chilukuri
Updated on: 22 Dec 2022 9:10 PM IST
Actress Poorna Gave Clarity on Wedding Cancel Rumors
X

Heroine Poorna: ఒక్క ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టిన పూర్ణ.. 

Heroine Poorna: "శ్రీ మహాలక్ష్మి" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పూర్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అవును, లడ్డు బాబు, నువ్వలా నేనిలా, శ్రీమంతుడు, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, అదుగో, సువర్ణ సుందరి, దృశ్యం 2, అఖండ వంటి ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన పూర్ణ ఈ మధ్యనే బాలకృష్ణ హీరోగా నటించిన "అఖండ" సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ మధ్యనే కేరళ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్త ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది పూర్ణ. ఈమధ్యనే వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. అయితే పూర్ణ మరియు తన కాబోయే భర్త కి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయని వారిద్దరూ త్వరలోనే విడిపోబోతున్నారని, వారిద్దరూ నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసుకుని విడిపోవడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఒకే ఒక ఫోటోతో ఈ పుకార్లు అన్నిటికి చెక్ పెట్టింది పూర్ణ. తన కాబోయే భర్తతో ఒక అందమైన ఫోటోని షేర్ చేస్తూ "ఎప్పటికీ నా వాడే" అని రాసుకొచ్చింది పూర్ణ. ఈ ఒక్క ఫోటోతో తన గురించి వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది ఈ భామ. ఇక సినిమాల పరంగా పూర్ణ త్వరలో నాని హీరోగా నటిస్తున్న "దసరా" సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story