Pooja Hegde: అందుకే ఫిట్ గా ఉంటాను అంటున్న పూజా హెగ్డే

*తన ఫిట్ నెస్ కి కారణం అదే అంటున్న పూజా హెగ్డే

admin1
Updated on: 13 Nov 2021 7:00 PM IST
Actress Pooja Hegde Reveals her Fitness Secret
X

 అందుకే ఫిట్ గా ఉంటాను అంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: నటనతో పాటు హీరోయిన్ అవ్వాలంటే బాగా కావాల్సిన వాటిల్లో ఫిట్ నెస్ కూడా ఒకటి. అందుకే తమ అందాన్ని కాపాడుకునేందుకు హీరోయిన్లు గంటలతరబడి జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్లు అయితే సైజ్ జీరో అంటూ తమ షేప్ ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న పూజా హెగ్డే మాత్రం తనకి రోజంతా జిమ్లో వర్కవుట్ చేయడం అంటే ఇష్టం లేదని చెబుతోంది. మరి తన ఫిట్నెస్ కి వెనుక కారణం ఏంటి అని అడిగితే పిలాటీస్ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

జిమ్ కి వెళ్లిన వెళ్లకపోయినా తను రెగ్యులర్ గా పిలాటీస్ చేస్తానని తను ఫిట్ గా ఉండటం కోసం యోగా మరియు పిలాటీస్ బాగా ఫాలో అవుతుందని చెప్పింది పూజా హెగ్డే. ఇక కెరీర్ పరంగా కూడా పూజా హెగ్డే చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "అల వైకుంఠపురం లో" సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. మరోవైపు "ఆచార్య" సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో కూడా హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించబోతోంది.

admin1

admin1

Next Story