Pooja Hegde : 'రాధేశ్యామ్' లో పూజా డ్యూయల్ రోల్.. అదే ట్విస్ట్ అంట?

Pooja Hegde : రాధేశ్యామ్ లో పూజా డ్యూయల్ రోల్.. అదే ట్విస్ట్ అంట?
x

pooja hegde

Highlights

Pooja Hegde : గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సినిమా రిలిజ్ట్ ఎలా ఉన్నాగాని సినిమా కలెక్షన్ల

Pooja Hegde : గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సినిమా రిలిజ్ట్ ఎలా ఉన్నాగాని సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం ఆదరగోట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఇందులో పూజా హేగ్దే డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. సినిమాలో ట్విన్స్ అయినా పూజా ఇద్దరిలో ఒకరూ సినిమా మొదలైన నాలుగు సినిమాలకే చనిపోతుందని తెలుస్తోంది. ఆ పాత్రే సినిమాకి కీలకం అని సమాచారం.. సినిమా కూడా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా అప్పటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుందని సమాచారం.. పూజా హేగ్దే డ్యూయల్ రోల్ అని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించనుంది. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ శర్మ, సాషా ఛేత్రి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఒక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి సినిమాతో జాతీయ అవార్డుని సంపాదించుకున్న నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కుతుండగా, సీ అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమా తర్వాత 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో అదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories