Pooja Hegde: ఫీలైన బుట్టబొమ్మ.. 'అసలు మీ సమస్య ఏంటంటూ' ఆగ్రహం..!

Pooja Hegde: 2014లో వచ్చిన 'ఒక లైలా కోసం' మూవీతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే.

Mokshith
Published on: 3 Feb 2025 11:34 AM IST
Actress Pooja Hegde Becomes Serious on Journalist
X

Pooja Hegde: ఫీలైన బుట్టబొమ్మ.. 'అసలు మీ సమస్య ఏంటంటూ' ఆగ్రహం..!

Pooja Hegde: 2014లో వచ్చిన 'ఒక లైలా కోసం' మూవీతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాలోనే తనదైన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన ఆడిపాడిందీ చిన్నది. ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే రంగస్థలంలో స్పెషల్‌ సాంగ్‌లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అలా వైకుంఠపురం తర్వాత పూజాకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య వంటి మూవీలు బాక్సాఫీస్‌ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక హిందీలో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన కిసి కా భాయ్‌ కిసి కా జాన్ మూవీ కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో పూజాకు అవకాశాలు తగ్గిపోయి. అయితే ప్రస్తుతం పూజా మళ్లీ సినిమాల్లో వేగాన్ని పెంచింది.

ప్రస్తుతం తమిళంతో రెండు సినిమాలు, హిందీలో ఒక చిత్రంలో నటిస్తోంది. తాజాగా షాహిద్‌ కపూర్‌తో నటించిన దేవా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూజా అసహనం వ్యక్తం చేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ జర్నలిస్ట్‌.. ‘సల్మాన్‌, హృతిక్‌, రణ్‌వీర్‌, షాహిద్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించడాన్ని మీరు అదృష్టంగా భావిస్తారా? అసలు అందుకు మీరు అర్హులేనా? అని అడిగారు. దీంతో కాస్త అసహనానికి గురైన పూజా.. ‘ఎస్‌.. అర్హురాలినే. ఒకవేళ అదృష్టం వల్లే నాకు అవకాశాలు వచ్చాయని మీరు అనుకుంటే.. నేను ఏమాత్రం బాధ పడను' అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

ఇక ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సన్నద్ధమై పూర్తి స్థాయిలో ఆ పాత్రకు న్యాయం చేయాలి. అదే అదృష్టంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. ఇక 'మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్‌ హీరోల సినిమాలైతేనే చేస్తారా'? అని మరో విలేకరి ప్రశ్నించగా.. ఆగ్రహానికి గురైన బుట్టబొమ్మ.. ‘అసలు మీ సమస్య ఏంటి?’ అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన షాహిద్‌ కపూర్‌ తన జోకులతో ఆ చర్చకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా చేశారు. మొత్తం మీద ఎప్పుడూ నవ్వుతూ ఉండే పూజా కోపానికి గురయ్యారు.

Mokshith

Mokshith

Next Story