Rakshana Movie OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న పాయల్ కొత్త సినిమా.. తొలిసారి ఆ పాత్రలో..!

Payal Rajput's Rakshana Movie OTT: ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది అందాల తార పాయల్ రాజ్‌పుత్.

Actress Payal Rajput Latest Movie Rakshana May Streaming From June 21st in OTT
X

Rakshana Movie OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న పాయల్ కొత్త సినిమా.. తొలిసారి ఆ పాత్రలో..!

Payal Rajput's Rakshana Movie OTT: ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది అందాల తార పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో తన అందంతో కుర్రకారు మతులుపోగొట్టిందీ చిన్నది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని నమోదు చేసుకున్న పాయల్‌కు ఆ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూకట్టాయి. అయితే ఆర్‌ఎక్స్‌100 తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది పాయల్‌. అయితే చాలా రోజుల తర్వాత అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం చిత్రంతో మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకుందీ చిన్నది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పాయల్ నటించిన మరో చిత్రం రక్షణ తాజాగా థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులో పాయల్‌ తొలిసారి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చి తాజాగా థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో పాయల్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలైన కేవలం 15 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 21వ తేదీ నుంచి ఆహాలో రక్షణ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికట ప్రకటన చేయనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆహాతో పాటు మరో ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... ఉన్న‌త చ‌దువులు చ‌దివిని లైఫ్‌లో స‌క్సెస్ అయిన ప‌లువురు అమ్మాయిలు సిటీలో వ‌రుస‌గా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటారు. వారిలో ఐపీఎస్ ఆఫీస‌ర్ కిర‌ణ్ (పాయ‌ల్ రాజ్‌పుత్‌) ప్రాణ స్నేహితురాలు ప్రియా కూడా ఉంటుంది. ప్రియా మ‌ర‌ణం వెనుక ఓ సైకో ఉన్నాడ‌ని కిర‌ణ్ అనుమానిస్తుంది. కానీ ఎలాంటి ఆధారాలు లేక‌పోవ‌డంతో కిర‌ణ్ మాట‌ల్ని పోలీసుల‌ను న‌మ్మ‌రు. ఇంతకీ అమ్మాయిల ఆత్మహత్యల వెనకాల ఉన్న రహస్యాలు ఎంటన్నదే ఈ సినిమా కథ.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story