అట్టహాసంగా పరిణీతి చోప్రా - రాఘవ చద్దా నిశ్చితార్థ వేడుక

బాలీవుడ్‌ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ చద్దా ఎంగేజ్‌మెంట్‌ కన్నుల పండుగగా జరిగింది.

Dhatripriya
Published on: 14 May 2023 11:01 AM IST
Actress Parineeti Chopra Raghav Chadha Engaged
X

అట్టహాసంగా పరిణీతి చోప్రా - రాఘవ చద్దా నిశ్చితార్థ వేడుక

Parineeti Chopra Raghav Chadha Engagement: బాలీవుడ్‌ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ చద్దా ఎంగేజ్‌మెంట్‌ కన్నుల పండుగగా జరిగింది. ఢిల్లీ కపుర్తాలా హౌస్‌లో నిన్న సాయంత్రం వేళ వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బంధుమిత్రుల ఆశీర్వాదాల నడుమ ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలో కొద్ద జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ వేడుకలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రముఖనటి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

నిజానికి రాఘవ్ చద్దా,పరిణీతి చోప్రా గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై వారు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ, ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎంపీ సంజీవ్ ఆరోరా ధృవీకరించారు. రాఘవ్, పరిణీతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "నేను రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ప్రేమ, ఆనందం, సాంగత్యంతో కలిసి మెలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మరోసారి వారికి నా శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. ఇక పరిణీతి, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ లో కలిసి చదువుకున్నారు. వారికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీరి ద్వారా పరిచయం పెరిగింది.ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story