Nivetha Thomas : పాత్ర కంటే రెమ్యునరేషన్‌ ఎక్కువేం కాదు : నివేథా

Nivetha Thomas : పాత్ర కంటే రెమ్యునరేషన్‌ ఎక్కువేం కాదు : నివేథా
x

Nivetha Thomas

Highlights

Nivetha Thomas : అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి నివేథా థామస్.. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఈమె

Nivetha Thomas : అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి నివేథా థామస్.. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. నాని హీరోగా నటించిన జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది ఈ భామ.. ఆ తర్వాత జై లవకుశ, నిన్ను కోరి, 118 చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకొని ఆమెకి మంచి విజయాన్ని అందించాయి..

ఇండస్ట్రీలో ఒక్క భారీ సక్సెస్ ఖాతాలో పడ్డాక తమ రెమ్యునరేషన్‌ని పెంచుతుంటారు హీరోయిన్లు అయితే నివేథా థామస్ మాత్రం తనకీ పాత్ర నచ్చితే రెమ్యునరేషన్‌ని తగ్గించుకుంటానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పాత్ర బాగుంటే మేకర్లకు కచ్చితంగా సపోర్ట్ చేస్తానని నివేథా వెల్లడించింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయమేనని చెప్పాలి. కమర్షియల్‌గా రెమ్యునరేషన్‌ గురించి ఆలోచించుకోకుండా పాత్రల కోసం పరితపించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని, సుదీర్ బాబు హీరోలుగా 'v' అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించగా, అమిత్ త్రివేది సంగీతం అందించాడు. హీరో నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 05 న ఓటీటీలో విడుదల అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories