మరికొద్ది గంటల్లో నిహారిక, చైతన్య వివాహం

నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహ వేడుక మరికొద్ది గంటల్లో జరగనుంది. ఒక్కొక్కరుగా పెళ్లి వేడుకలకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదిస్తున్నారు. నిన్న జరిగిన సంగీత్ ప్రోగ్రాం తారలతో సందడిగా మారింది

admin
Published on: 9 Dec 2020 6:49 AM IST
మరికొద్ది గంటల్లో నిహారిక, చైతన్య వివాహం
X

నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహ వేడుక మరికొద్ది గంటల్లో జరగనుంది. ఒక్కొక్కరుగా పెళ్లి వేడుకలకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదిస్తున్నారు. నిన్న జరిగిన సంగీత్ ప్రోగ్రాం తారలతో సందడిగా మారింది. డ్యాన్సులు, కోలాటాలతో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోలాహలంగా మారింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో స్టెప్పులేశారు. ఇక నిహారిక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఉదయ్‌పూర్ వెళ్లారు. ఆ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

admin

admin

Next Story