పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన నిధి?

పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన నిధి?
x
Highlights

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకి పరిచయం అయింది నిధి అగర్వాల్.. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుంది నిధి.

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకి పరిచయం అయింది నిధి అగర్వాల్.. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుంది నిధి.. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసిన అది కూడా ప్లాప్ అయింది. ఇక గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ కావడంతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చేసింది. వరుస సినిమాలకి సైన్ చేసి బిజీ అయిపోతుంది.

అయితే తాజాగా పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఈ భామకి ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఇప్పటికే కథ చర్చలు జరగగా, నిధి కూడా ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇక ఈ సినిమాకు ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది ప‌వ‌న్ 27వ సినిమా కావడం విశేషం. పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నుంది. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంద‌నే దానిపైన క్లారిటీ లేదు.

ఇక ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. పవన్ రీఎంట్రీ మూవీ ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని మేలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమానే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టారు పవన్

Show Full Article
Print Article
Next Story
More Stories