Nayanthara: 'దయచేసి ఆ మెసేజ్‌లకు ఎవరూ స్పందించకండి': నయనతార

నయనతార ఎక్స్‌ ఖాతా హ్యాక్‌కి గురైనట్లు అధికారికంగా ప్రకటించింది. ‘దయచేసి ఆ అకౌంట్‌ నుంచి వచ్చే సందేశాలకు కానీ, ట్వీట్లకు కానీ ఎవరూ స్పందించొద్దు. నా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది. ఈ విషయంపై సైబర్‌ పోలీస్‌లకు కంప్లయింట్‌ చేశా. త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తా’ అని తెలిపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Sept 2024 10:38 AM IST
Actress nayanthara says her x account is hacked
X

Nayanthara: 'దయచేసి ఆ మెసేజ్‌లకు ఎవరూ స్పందించకండి': నయనతార 

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెలబ్రిటీలు, అభిమానుల మధ్య ఇంటరాక్షన్‌ ఎక్కువైంది. సినీ తారలు నేరుగా అభిమానులతో మాట్లాడుకునే రోజులు వచ్చేశాయ్. అభిమానులు చేసే మెసేజ్‌లకు, ట్వీట్స్‌కు సినీ తారలు స్పందిస్తున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్ వేదికగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సైతం హీరోయిన్లు సమాధానాలు ఇస్తున్నారు.

అయితే ఇదే నేపథ్యంలో కొందరు సైబర్‌ మోసగాళ్లు దీనిని అనువుగా మార్చుకొని సెలబ్రిటీల అకౌంట్స్‌ను హ్యాక్‌ చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల సోషల్‌ మీడియా అకౌట్స్‌ను హ్యాక్‌ చేసి రకరకాల పోస్టులు చేస్తున్నారు. దీంతో తమ అకౌంట్స్‌ హ్యాక్‌ అయినట్లు అధికారింగా ప్రకటించే రోజులు వచ్చాయి. తాజాగా అందాల తార నయనతారకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

నయనతార ఎక్స్‌ ఖాతా హ్యాక్‌కి గురైనట్లు అధికారికంగా ప్రకటించింది. ‘దయచేసి ఆ అకౌంట్‌ నుంచి వచ్చే సందేశాలకు కానీ, ట్వీట్లకు కానీ ఎవరూ స్పందించొద్దు. నా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది. ఈ విషయంపై సైబర్‌ పోలీస్‌లకు కంప్లయింట్‌ చేశా. త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తా’ అని తెలిపింది. ఈ విషయాన్ని ఎక్స్‌ ఖాతా వేదికగా ప్రకటించింది.

నయనతార కెరీర్‌ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం టెస్ట్‌, తని ఒరువన్‌-2, మన్నన్‌గట్టి 1960, డియర్‌ స్టూడెంట్స్ సినిమాలతో బిజీగా ఉంది. నయనతార చివరిగా 2023లో వచ్చిన అన్నపూరణి అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పలు వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story