Nayanthara: త్వరలోనే వివాహ తేదీని ఖరారు చేయబోతున్న నయనతార

* పెళ్లి కోసం సినిమా వదులుకున్న నయనతార

admin1
Updated on: 28 Oct 2021 3:31 PM IST
Actress Nayanthara Going to Marry Director Vignesh Shivan Soon
X

త్వరలోనే వివాహ తేదీని ఖరారు చేయబోతున్న నయనతార(ట్విట్టర్ ఫోటో) 

Nayanthara - Vignesh Shivan: సౌత్ స్టార్ బ్యూటీ నయనతార గత కొంత కాలంగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో రిలేషన్షిప్ లో ఉన్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం నయనతార తన సినిమా షూటింగ్ లన్నిటిని పూర్తి చేసుకుని కొన్నాళ్లు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుందాం అని నిర్ణయించుకుంది. మరోవైపు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేయడంతో షారుక్ ఖాన్ మరియు నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.

ఒకవేళ ఈ సినిమా షూటింగ్ మొదలైనా సరే నయనతార మాత్రం తన పెళ్లి సమయానికి డేట్లు కుదరకపోతే ఈ సినిమాని వదులుకోవడానికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా చేసుకున్న వీరిద్దరు త్వరలోనే ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం నయనతార తొందర్లోనే తన వివాహ తేదీని ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నయనతార తన కాబోయే భర్తతో కలిసి పలు గుళ్ళను సందర్శించి వచ్చింది.

admin1

admin1

Next Story