Happy Birthday Nayanthara : హ్యాపీ బర్త్ డే నయన్!

కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. అలా కెరియర్ ని మొదలు పెట్టిన నయనతార..

Krishna
Updated on: 18 Nov 2020 9:00 AM IST
Happy Birthday Nayanthara : హ్యాపీ బర్త్ డే నయన్!
X

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ లలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ లలో నయనతార ఒకరు.. బిజీబిజీ గా ఉంటూ వరుస సినిమాలు చేస్తూ సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార.. ఈ రోజు నయనతార తన 36 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్బంగా నయనతారకి అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నయన్ పుట్టినరోజు సందర్బంగా ఆమెకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. అలా కెరియర్ ని మొదలు పెట్టిన నయనతార.. ఆ తర్వాత 'విస్మయతుంబట్టు', 'తస్కర వీరన్', 'రాప్పకల్' వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక పి వాసు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాతో నయనతారకి స్టార్ డమ్ అందింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా నయన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత తెలుగులోనూ గజిని,లక్ష్మీ,బాస్ వల్లభ, చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక అజిత్‌తో కలిసి చేసిన 'బిల్లా' సినిమా ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టింది. నయన్ గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా బాపు దర్శకత్వంలో వచ్చిన 'శ్రీరామరాజ్యం'సినిమాలో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను నయనతారకి 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు వచ్చాయి.

ప్రేమ వార్తలూ.. సినిమా సంగతులు..

కేవలం సినిమాలతో మాత్రమే కాదు వ్యక్తిగత విషయాలలోను నయన్ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఆమె కెరియర్ మొదటి నుంచీ రకరకాల వదంతులకు వేదికగా నిలిచింది. కెరియర్ ప్రారంభంలోనే నటుడు శింబుతో ప్రేమాయణం కొనసాగించిన నయన్, ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుదేవాతో పెళ్లి వరకూ వెళ్లినట్టు విపరీతమైన ప్రచారం చోటుచేసుకుంది. అయితే, అది జరగలేదు. ఆ లవ్ కి బ్రేకప్ చెప్పిన ఈ తార తరువాత తన సినీ జీవితంపైనే ఏక్కువ దృష్టి సారించింది.

ఆ తరువాత ఆమె రెండో ఇన్నింగ్స్ సూపర్ రేంజిలో ముందుకు సాగుతూ వచ్చింది. మళ్ళీ తమిళ దర్శకుడు విఘ్నేశ శివన్ తో నయన్ ప్రేమలో పడ్డారు. ఎక్కడికి వెళ్ళిన ఈ జోడి కలిసే వెళ్తుంది. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక గత ఏడాది సైరా, విజిల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్, తాజాగా అమ్మోరు సినిమాతో అలరించింది. నయన్ మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది హెచ్.ఎం.టీ.వీ

Krishna

Krishna

Next Story