ఆ దేవుడు మిమ్మల్ని త్వరగా తీసుకెళ్లాడు.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్‌ పోస్ట్‌

Actress Meena: నటి మీనా భర్త విద్యాసాగర్ గత కొద్దిరోజుల క్రితం హఠ్మారణం పొందిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 15 July 2022 3:00 PM IST
Actress Meena Remembers Late Husband Vidyasagar
X

ఆ దేవుడు మిమ్మల్ని త్వరగా తీసుకెళ్లాడు.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్‌ పోస్ట్‌

Actress Meena: నటి మీనా భర్త విద్యాసాగర్ గత కొద్దిరోజుల క్రితం హఠ్మారణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో కొవిడ్‌ బారిన పడిన ఆయన కోలుకున్నప్పటికి పోస్ట్‌ కోవిడ్‌, ఊపరితిత్తుల సమస్యలు వెంటాడాయి. లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ సోకడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. దురదృష్టవశాత్తూ కోలుకోలేక జూన్‌ 29న తుదిశ్వాస విడిచారు. అయితే మంగళవారం(జూలై 12) మీనా పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తను గుర్తు చేసుకుంటూ మీనా భావోద్యేగానికి లోనయింది. భర్తను తలచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ నోట్‌ పంచుకుంది.

సోషల్‌ మీడియాలో తన భర్త ఫొటోను షేర్‌ చేస్తూ ' మీరు దేవుడు ఇచ్చిన ఓ అద్భుతమైన బహుమతివి. కానీ ఆ దేవుడు చాలా త్వరగా మిమ్మల్ని నా నుంచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు. మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారు. ఇలాంటి కఠిన సమయంలో మా పట్ల ప్రేమ, అప్యాయత చూపించిన ప్రపంచంలోని ప్రతి మంచి మనసుకు నేను, నా కుటుంబం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో మాకు అండగా ఉన్న బంధువులు, స్నేహితులకు మేం రుణపడి ఉంటాం. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ అవసరమే' అంటూ ఎమోషనల్‌ నోట్‌ పెట్టింది మీనా. కాగా మీనా, విద్యాసాగ‌ర్ను 2009 జులై 12న పెళ్లాడింది. వీరికి కూతురు నైనిక జన్మించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story