Meena: రెండో పెళ్లికి సిద్ధమైన మీనా... వరుడు ఎవరంటే?

Meena: రెండో పెళ్లికి సిద్ధమైన మీనా... వరుడు ఎవరంటే?

Arun Chilukuri
Published on: 30 Nov 2022 4:02 PM IST
Actress Meena Getting Married Again?
X

Meena: రెండో పెళ్లికి సిద్ధమైన మీనా... వరుడు ఎవరంటే?

Meena Second Marriage: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగి 1990ల కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన మీనా గురించి తెలియని వారు ఉండరు. తెలుగులో మాత్రమే కాక తమిళ్ మరియు మలయాళం భాషల్లో కూడా ఎందరో స్టార్ హీరోలతో నటించిన మీనా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగులో కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అందరూ సీనియర్ హీరోలతో నటించిన మీనా 2009 సమయంలో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు విద్యాసాగర్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లాడి కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైంది.

ఆ తర్వాత మీనా కూతురు నైనిక కూడా ఇప్పుడు కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. మరోవైపు మీనా కూడా దృశ్యం, దృశ్యం 2 వంటి సినిమాలలో కనిపించింది. ఈ మధ్యనే మీనా జీవితంలో విద్యాసాగర్ మరణంతో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యానికి గురైన విద్యాసాగర్ జూన్ లో కన్నుమూశారు. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీనా మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలని అనుకుంటున్నారు.

అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మీనాని రెండవ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. కానీ మీనాకి మాత్రం ఇది ఏ మాత్రం ఇష్టం లేదని, కానీ తన కుమార్తె నైనిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీనా కూడా దీనికి అంగీకరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వరుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి అని, ఆమె భర్తకు మంచి మిత్రుడు అని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story