Balakrishna New Movie: బాలకృష్ణతో మళ్లీ జతకట్టనున్న మీనా..?

Balakrishna New Movie: 1990 లలో దక్షిణాన ఉన్న స్టార్ హీరోయిన్లలో మీనా ఒకరు.

Venkata Chari
Published on: 8 May 2021 11:29 AM IST
Actress Meena Again Acting in Balakrishna New Movie
X

బాలకృష్ణతో మళ్లీ జతకట్టనున్న మీనా..? (ఫొటో దిహన్స్ ఇండియా)

Balakrishna New Movie: 1990 లలో దక్షిణాన ఉన్న స్టార్ హీరోయిన్లలో మీనా ఒకరు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి ఆమె అనేక తెలుగు చిత్రాల్లో నటించింది. చాలకాలం తరువాత రీఎంట్రీ ఇచ్చిన మీనా.. వెంకటేష్ హీరోగా నటించిన "దృశ్యం 2" చిత్రంలో కనిపించనుంది. ప్రస్తుతం సీక్వెల్ లోనూ అదే పాత్రలో నటించనుంది.

తాజా సమాచారం మేరకు మీనా తెలుగులో మరో పెద్ద ఆఫర్‌ లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో మీనా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని టాక్. బాలకృష్ణ, మీనా ఇద్దరూ ఇంతకుముందు "ముద్దుల మొగుడు", "బొబ్బిలి సింహం" చిత్రాలలో కలిసి నటించారు. ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని సమాచారం. ప్రస్తుతానికి, బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ సినిమాతో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari

Venkata Chari

Next Story