Manisha Koirala: బికినీ వేసుకోను అంటే తిట్టాడు.. చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న మనీషా..!

Manisha Koirala: మనీషా కొయిరాల.. ఈ తరానికి ఈ హీరోయిన్‌ పెద్దగా పరిచయం లేకపోయినా. బొంబాయి చిత్రం గుర్తున్న ప్రతీ ఒక్కరికీ ఈ బ్యూటీ తెలిసే ఉంటుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 July 2024 3:38 PM IST
Actress Manisha Koirala Recalls a Bad Memory About her Past in Career Starting Days
X

Manisha Koirala: బికినీ వేసుకోను అంటే తిట్టాడు.. చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న మనీషా..!

Manisha Koirala: మనీషా కొయిరాల.. ఈ తరానికి ఈ హీరోయిన్‌ పెద్దగా పరిచయం లేకపోయినా. బొంబాయి చిత్రం గుర్తున్న ప్రతీ ఒక్కరికీ ఈ బ్యూటీ తెలిసే ఉంటుంది. బొంబాయి చిత్రంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌ పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో ఈ సినిమా విజయంతో మనీషాకు వరుసగా అవకాశాలు లభించాయి. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన మనీషా ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

2012లో మనీషా తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపి అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. అయితే 2014 తర్వాత క్యాన్సర్‌ నుంచి కోలుకున్న మనీషా మళ్లీ సినిమాలో నటించారు. హీరామండి వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న వెబ్‌ సిరీస్‌లో నటించనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీషా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.

కెరీర్‌ తొలినాళ్లలో ఫొటో షూట్ చేసే సమయంలో ఓ ఫొటోగ్రాఫర్‌ తనను తెగ పొగిడాడని చెప్పుకొచ్చిన మనీషా.. తర్వాత ఆ ఫొటో గ్రాఫర్‌ తనను బికినీ ధరించమని అడిగాడంటా. అయితే తాను మాత్రం స్విమ్మింగ్‌ చేసే సమయంలోనే అలాంటి డ్రెస్‌లు వేసుకుంటానని.. సినిమాల్లో అవకాశాల కోసం ఇలాంటి డ్రెస్‌లు వేసుకోను అని తేల్చి చెప్పేసింది.

దీంతో సదరు ఫొటో గ్రాఫర్‌ తనను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడని మనీషా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆ ఫొటో గ్రాఫర్‌ మాట్లాడుతూ.. 'కరగడానికి నిరాకరించే మట్టిముద్ద నుంచి ఎవరూ బొమ్మను తయారుచేయలేరు' అని అన్నాడు. తాను ఆ మాటలను ఇప్పటికీ మర్చిపోలేదని మనీషా మనసులో మాటను బయట పెట్టేసింది. అయితే మనీషా హీరోయిన్‌ అయ్యాక సదరు ఫొటోగ్రాఫరే ఫొటోలు తీయడానికి వచ్చాడని గతాన్ని గుర్తు చేసుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story