అరుదైన చర్మ వ్యాధికి గురైన హీరోయిన్

*తన చర్మ వ్యాధి గురించి బయటపెట్టిన హీరోయిన్

Jyothi
Updated on: 16 Jan 2023 8:00 PM IST
Actress Mamta Mohandas is Suffering from Skin Disease
X

అరుదైన చర్మ వ్యాధికి గురైన హీరోయిన్

Mamta Mohandas: మలయాళం బ్యూటీ మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. కానీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ ఈ మధ్యనే విటిలిగో అనే ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధికి గురైనట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఆమె చర్మంపై కొన్ని ప్యాచెస్ లాగా వచ్చాయి. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అభిమానులతో పంచుకుంది మమతా మోహన్ దాస్. కలర్ మారినా తన చర్మాన్ని ఫోటోలు తీసి దాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. "డియర్ సూర్యుడా! ఇంతకుముందు ఎన్నడూ లేనట్టు వంటి విధంగా నేను నిన్ను దగ్గరకు తీసుకుంటున్నాను.

నా రంగు నేను కోల్పోతున్నాను. ప్రతిరోజు ఉదయం నీకంటే ముందే లేస్తున్నాను. నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇవ్వు. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను," అని రాసింది మమతా మోహన్ దాస్. ఇక తన అభిమానులందరూ మమత ను స్ట్రాంగ్ గా ఉండమని ఆమె త్వరలోనే కోలుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు. "అది కేవలం స్కిన్ కండిషన్ మాత్రమే. మీరు ఒక ఫైటర్ మరియు చాలామందికి ఇన్స్పిరేషన్. గాడ్ బ్లెస్స్ యు," అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

యువ నటి రెబా మౌనిక కూడా "నువ్వు ఒక ఫైటర్ వి. నువ్వు చాలా అందంగా ఉంటావు" అని కామెంట్ చేసింది. గతంలో మమత మోహన్ దాస్ క్యాన్సర్ కి గురైన సంగతి కూడా తెలిసింది. చాలా కాలం క్యాన్సర్ తో బాధలు పడ్డ మమతా మోహన్ దాస్ ఈ మధ్యనే కోలుకొని మళ్ళీ సినిమాల్లోకి రియంట్రీ ఇచ్చింది. కానీ ఈ లోపే మళ్ళీ ఆమె ఈ చర్మవ్యాధికి గురైంది.

Jyothi

Jyothi

Next Story