Madhavi Latha Re-entry with Lady Movie: రియల్ స్టోరీ "లేడీ''తో మాధవి లత 'రీఎంట్రీ'

Madhavi Latha  Re-entry with Lady Movie: రియల్ స్టోరీ లేడీతో మాధవి లత రీఎంట్రీ
x
madhavilatha
Highlights

Madhavi Latha Re-entry with Lady Movie: ప్రముఖ హీరోయిన్ మాధవి లత సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ డైరెక్షన్ లో రూపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా "లేడీ"

Madhavi Latha Re-entry with Lady Movie: ప్రముఖ హీరోయిన్ మాధవి లత సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ డైరెక్షన్ లో రూపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా "లేడీ". ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని చ‌రన్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీకే స్టూడియోజ్ బ్యానెర్లు పై సత్యనారాయణ గొరిపర్తి, జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఒకే ఒక క్యారెక్టర్ తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా దర్శ‌కుడు కళ్యాణ్ తెలిపారు. అలానే ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్. సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులును ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా కళ్యాణ్ చెప్పారు. ఈ సినిమాకి మాధవి లత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది. చిత్రానికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సత్యనారాయణ చెప్పారు.

ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో మాధవి లత న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి జీ ఎస్ ఎస్ ఎస్ పీ కళ్యాణ్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, వి ఎఫ్ ఎక్స్, డిఐ, పబ్లిసిటీ డిజైన్స్ గా పని చేస్తున్నాడు. ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతాన్ని అందించ‌నున్నారు. పి ఆర్ ఓగా ఏలూరు శ్రీను, ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ గా వేణు కార్తికేయన్ ప‌నిచేస్తుండ‌గా.. జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్, సత్యనారాయణ గొరిపర్తి ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories