ఫ్యాన్స్ తిడితే తిట్టుకోండి.. ప్రభాస్ తప్పు చేశారు.. హీరోయిన్‌ మాధవీ లత సంచలన వ్యాఖ్యలు

Adipurush: బాహుబలి వంటి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని, తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు ప్రభాస్.

Arun Chilukuri
Published on: 21 Jun 2023 5:43 PM IST
Madhavilatha Fired on Prabhas
X

ఫ్యాన్స్ తిడితే తిట్టుకోండి.. ప్రభాస్ తప్పు చేశారు.. హీరోయిన్‌ మాధవీ లత సంచలన వ్యాఖ్యలు

Adipurush: బాహుబలి వంటి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని, తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ కూడా అంతకుమించి అనేంతగా ఉంటుందని అంతా ఊహించారు. సనాతన భారతీయ సాహితీ సాంస్కృతిక విలువలకు ఆదిపురుష్ లో పట్టం కడతారని.. అంతర్జాతీయ రేంజ్ కు ఎదిగిన తెలుగు సినిమా.. తాజా సినిమాతో కొత్తపుంతలు తొక్కుతుందని ఆశపడ్డారు. అయితే అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్టుగా ఆదిపురుష్ టాక్ అధ్వానంగా తయారైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదిపురుష్ ఇష్యూ లోకి ఎంటరై సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి మాధవీలత. ఇందులో ఓం రౌత్‌ది మాత్రమే కాకుండా.. ప్రభాస్‌ది కూడా తప్పు ఉందంటూ సంచలన కామెంట్స్ చేసింది.

ఆదిపురుష్‌ మ్యాటర్‌లో అందరూ డైరెక్టర్‌ని దొబ్బుతున్నారని, హీరో మ్యాటర్‌లో సైలెంట్‌ అయ్యారని అన్నారు. హీరోకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. స్టోరీ వినేటప్పుడు, తీసేటప్పుడు, డైలాగ్‌ చెప్పేటప్పుడు తెలియలేదా అని అన్నారు. ప్రభాస్‌ ఏమన్నా న్యూ హీరోనా.. డైరెక్టర్‌ ఏది చెబితే అది చేయటానికి అని పేర్కొన్నారు. హీరో చెప్పినట్లుగానే కదా డైరెక్టర్‌ వింటారు అని అన్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తనను తిట్టినా పర్లేదన్నారు. హీరో తప్పు 50 శాతం ఉందని అన్నారు. రామాయణం తీసేటప్పుడు రామాయణం గురించి తెలుసుకోరా అని ప్రశ్నించారు. నిష్ఠ లేదా.. బాధ్యత లేదా అంటూ మండిపడ్డారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story