వాడికే కప్ ఇచ్చి బిగ్ బాస్ సెట్ ని తగలబెట్టండి..శన్ముఖ్ పై మాధవీలత సంచలన కామెంట్స్

Actress Maadhavi Controversial Post in Social Media About Bigg Boss Team and Host Nagarjuna
x

శన్ముఖ్, బిగ్ బాస్ పై మాధవీలత సంచలన కామెంట్స్

Highlights

Actress Maadhavi: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 షోపై నటి మాధవీలత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్...

Actress Maadhavi: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 షోపై నటి మాధవీలత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ రిలేషన్ పై పలు వ్యాఖ్యలు చేసిన మాధవీలత.. తాజాగా తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా బిగ్ బాస్ తో పాటు హోస్ట్ నాగార్జునపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫేస్ బుక్ లో మాధవీలత ఇలా పోస్ట్ చేసింది..

ఏమయ్యా బిగ్ బాస్... సిగ్గులేని టీమ్‌ మీది... ఆ బిగ్ బాస్ హౌస్ లో ఏంటి ఆ అరాచకం. ఒక పిల్లను బానిసని చేసి నవ్వకూడదు, ఏడవకూడదు, వంగకూడదు, కూర్చోకూడదు అనే మానసిక ఆత్యాచారం చేస్తుంటే ఎవడో పెళ్లాన్ని ఇంకోకడు డామినేట్ చేస్తుంటే వీకెంట్ ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మావేమో అబ్బా ఏంట్రా ఇది అంటూ వగలుపోయి.., అమ్మ వద్దని చెప్పినా హగ్గులు ఇప్పిస్తూ మీ ఫుటేజ్ కోసం చివరికి నాగార్జునని కూడా దిగజార్చిన మీకు టీఆర్పీ లేక ఏడుస్తున్నారు. ఒక కన్నతల్లి మాటని విలువ లేకుండా చేసిన కూతుర్ని సపోర్ట్ చేస్తూ సభ్యసమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మా నాగ్ మావా..

ఎందంటి ఈ అరాచకం ఏందీ అంటా..!! అలాంటి ఏదవలకు బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. వాడికే బిగ్ బాస్ కప్ తగలబెట్టి మీ బిగ్ బాస్ సెట్ ని కూడా తగలబెట్టండి. ఇలాంటి వాడికి కీరిటం పెడితే మీ బిగ్ బాస్ కొంపకి ఫైర్ యాక్సిడెంట్ అయి నిమిషంలో తగలబడిపోతుంది చూడండి. అసలు సమాజానికి ఏం చూపిస్తున్నారు ? యూత్ లో హగ్గులు, ముద్దులు తప్పేమీ కాదు..కాని పక్కోడి పెళ్లాన్ని హగ్ చేసుకోవచ్చు అంటున్నారు.

నాతో వాదిస్తున్నారు అందులో తప్పేంటని. మీ బిగ్ బాస్ టీమ్ చివరి ఎపిసోడ్ చూసి.. మీ నిర్ణయం సమాజానికి ఉపయోగపడకపోతే బిగ్ బాస్ షో పై ఏకంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తాను. హైకోర్టులో కూడా వేస్తాను. ఇది జోక్ కాదు.. సీరియస్. తల్లిదండ్రులతో కలిసి చూడాలంటే సిగ్గుగా ఉంది. చెవిపై, మెడపై ఇలా ముద్దులు పెట్టుకుంటే చూడటానికి అసహ్యంగా ఉందని "తగలబెట్టండి సర్ బిగ్ బాస్ 5 వరస్ట్ టీమ్.. వరస్ట్ షో" అని సోషల్ మీడియాలో మాధవీలత చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories