Lavanya Tripathi: తన కామెడీతో నవ్వించనున్న అందాల రాక్షసి

*మొదటిసారి కామెడీ చేయబోతున్న లావణ్య త్రిపాఠి

admin1
Updated on: 2 Dec 2021 4:31 PM IST
Actress Lavanya Tripathi is Going to Act Key Role in Crime Comedy Movie
X

లావణ్య త్రిపాఠి (ఫైల్ ఫోటో)

Lavanya Tripathi: టాలెంటెడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి తాజాగా ఇప్పుడు ఒక క్రైమ్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లావణ్య త్రిపాఠి మొదటిసారి ఈ జోనర్ లో ఒక సినిమాలో నటించబోతోంది. ఈ సినిమా కి "మత్తు వదలరా" ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. "అది మిగతా అన్ని సినిమాల కంటే చాలా భిన్నమైన సినిమా. ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది" అని "మత్తు వదలరా" సినిమా గురించి చెప్పింది లావణ్య త్రిపాఠి. ఇక కామెడీ జానర్లో సినిమాలో నటించాలని తనకు ఎప్పటినుంచో ఉందని అలాంటిది రితేష్ రానా తన కోసం ఈ పాత్ర ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

"నేను ఎప్పటి నుంచో నా కామెడీ టైమింగ్ మీద వర్క్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలు పెడదామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని అంటోంది లావణ్య త్రిపాఠి. ఇక ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉండబోతోందని నిజ జీవితంలో తాను చాలా కామెడీ చేస్తుంది కానీ కెమెరా ముందు చేయడం ఇదే మొదటిసారి అని దానికోసం బాగా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పింది ఈ భామ. తను తన పాత్రలు సెలెక్ట్ చేసుకునే విషయంలో కొంచెం ఆలోచిస్తానని అంటోంది ఈ భామ.

admin1

admin1

Next Story