Kubbra Sait: అతని వల్ల పెళ్లికి ముందే గర్భవతిని అయ్యాను

Kubbra Sait: నటి కుబ్రా సెయిత్ తన జీవితంలోని అత్యంత వ్యక్తిగతమైన , కఠినమైన సంఘటనను ధైర్యంగా పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Naresh.k
Published on: 5 Feb 2026 9:04 AM IST
Kubbra Sait
X

Kubbra Sait: అతని వల్ల పెళ్లికి ముందే గర్భవతిని అయ్యాను 

Kubbra Sait: నటి కుబ్రా సెయిత్ తన జీవితంలోని అత్యంత వ్యక్తిగతమైన , కఠినమైన సంఘటనను ధైర్యంగా పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలు సాధారణంగా తమ వ్యక్తిగత విషయాలను దాచడానికి ప్రయత్నిస్తారు, కానీ కుబ్రా తన నిజాయితీతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

సినీ పరిశ్రమలో కుబ్రా సెయిత్ అంటే కేవలం ఒక నటి మాత్రమే కాదు.. స్పష్టమైన అభిప్రాయాలు కలిగిన ఒక ధైర్యవంతురాలు. బెంగళూరులో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, సల్మాన్ ఖాన్ సరసన 'రెడీ', 'సుల్తాన్' వంటి చిత్రాలతో పాటు 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారామె. అయితే, వెండితెరపై ఎంత బోల్డ్‌గా కనిపిస్తారో, నిజజీవితంలో కూడా అంతే నిజాయితీగా ఉంటానని ఆమె మరోసారి నిరూపించారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుబ్రా తన గతంలోని ఒక చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఒక పర్యటనలో స్నేహితులతో కలిసి మద్యం మత్తులో ఎంజాయ్ చేసిన సమయంలో, ఒక స్నేహితుడితో పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపారు.

=అయితే, ఆ సంఘటన వల్ల ఆమె పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యారు. ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను. నా జీవితంలో అది ఒక పెద్ద పొరపాటుగా అనిపించింది. కానీ అబార్షన్ చేయించుకోవాలని తీసుకున్న నిర్ణయం నా వ్యక్తిగతమైందని ఆమె కుండబద్దలు కొట్టారు.

Naresh.k

Naresh.k

Next Story