Krithi Shetty: లిప్ లాక్ సెంటిమెంట్ వల్లే సినిమా సైన్ చేసిన కృతి శెట్టి

*లిప్ లాక్ ఒక సెంటిమెంట్ గా మారింది అంటున్న కృతి శెట్టి

admin1
Updated on: 22 Dec 2021 6:00 PM IST
Actress Krithi Shetty Says Lip Lock is Sentiment for my Movies
X

 కృతి శెట్టి (ట్విట్టర్ ఫోటో)

Krithi Shetty: సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమాతో కృతి శెట్టి కూడా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో కృతి శెట్టి లిప్ లాక్ మరియు రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. దీంతో కృతి కి సినిమాలో లిప్ లాక్ ఉండటం ఉంటే హిట్టవుతుందని ఒక సెంటిమెంట్ ఏర్పడిందట.

ఇక శ్యామ్ సింగరాయి సినిమాకి దర్శకుడు కథ చెబుతున్నప్పుడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయని చెప్పగానే కృతి శెట్టి వెంటనే ఓకే చెప్పేసిందట. శ్యామ్ సింగరాయ సినిమాలో కృతి శెట్టి మరియ నానికి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఒక లిప్ లాక్ ఉందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక సినిమాలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే కృతి శెట్టికి లిప్ లాక్ సెంటిమెంట్ నిజంగానే బాగా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు.

admin1

admin1

Next Story