Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌తో రొమాన్స్ చేయనున్న కేతిక శర్మ

Samba Siva Rao
Updated on: 28 March 2021 5:32 PM IST
Ketika Sharma to Romance with Vaishnav Tej
X

 Vaishnav Tej

మెగా కుంటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ ఓ చిత్రంలో నటించ‌గా.. ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇక మ‌రోవైపు నాగార్జున కూడా వైష్ణ‌వ్‌తో ఒక సినిమా చేయనున్నాడని సమాచారం. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వ‌ర్మ‌ ద‌ర్శ‌కుడు గిరీష‌య్య‌తో ఓ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించ‌నుండ‌గా ఏప్రిల్ 2న లాంఛనంగా ప్రారంభంకానుందని సమాచారం. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా ఉత్తరాది భామ కేతిక శర్మ నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పస్తుతం కేతిక శర్మ, నాగశౌర్య లక్ష్య తోపాటు ఆకాష్ పూరి రొమాంటిక్‌లో నటిస్తోంది. వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఓ నవల ఆధారంగా తెరకెక్కించాడు క్రిష్. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

వైష్ణవ్ తేజ్ గత చిత్రం ఉప్పెన.. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. వంద కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు సినిమా నిర్మాతలు పేర్కోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించగా, విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story