ఆడవాళ్లు ఆలానే కనిపిస్తున్నారా? అజిత్ ఫ్యాన్‌పై కస్తూరి ఫైర్.. బొమ్మలా చూస్తున్నారు

ఆడవాళ్లు ఆలానే కనిపిస్తున్నారా? అజిత్ ఫ్యాన్‌పై కస్తూరి ఫైర్.. బొమ్మలా చూస్తున్నారు
x
Ajith And Kasturi File Photo
Highlights

తమిళనటి కస్తూరి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో అన్నమయ్యలో సినిమాలో నాగార్జున సరసన ఆమె నటించారు.

తమిళనటి కస్తూరి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో అన్నమయ్యలో సినిమాలో నాగార్జున సరసన ఆమె నటించారు. దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలాకాలం తర్వాత తెలుగులో 'శమంతకమణి' సినిమాలో నటించారు. ఆ సినిమాలో కస్తూరి సుధీర్ బాబుకు మదర్ క్యారెక్టర్ వేశారు. తాజా ఓ తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారు.

కాగా.. గత కొద్ది రోజులుగా ఆమెకు వేధింపులు తప్పలేదు. ట్విటర్ వేదికగా ఓ వక్తి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై కస్తూరి ఆగ్రహంతో సదరు వ్యక్తి ట్విట్టర్లోనే కడిగిపారేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్‌ అని చెప్పుకుంటూ అసభ్యకరంగా ఎలా మాట్లాడతారంటూ విమర్శించింది. మహిళల మీద నీచమైన కామెంట్స్ ఇలాంటి వాళ్లని ఏమనాలి ? . దీంతో అతడ్ని నీకు ఆడవాళ్లు సెక్స్ కోసమే కావాలంటే.. బయటకి వెళ్లడం ఎందుకు? మీ ఇంట్లో నీ అక్కనో, అమ్మనో అడగండి' అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.

దానితో ఆగకుండా.. డర్టీ అజిత్ ఫ్యాన్స్ అంటూ ట్యాగ్ ఇచ్చారు. ‎అజిత్ అభిమాని పేరిట కస్తూరిపై వల్గర్ ట్వీట్ చేశారు. తనపై అజిత్ అభిమానులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ట్విట్ చేసింది. హీరో అజిత్ దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మహిళలపై వల్గర్ కామెంట్స్ చేస్తున్న వారిని అజిత్ వారించకుండా బొమ్మల్లా చూస్తున్నారని నటి కస్తూరి విమర్శించారు. ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అజిత్‌ను కోరారు. అంతే కాకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కస్తూరి అభ్యర్థించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories