Actress Kasthuri Shankar Debate Video Viral: లైవ్‌లో లంచ్ చేస్తూ కనిపించిన నటి కస్తూరి.. వీడియో వైరల్!

Actress Kasthuri Shankar Debate with Video Viral: కరోనా నేపధ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇంట్లో నుంచే పలు ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Krishna
Updated on: 20 July 2020 4:17 PM IST
Actress Kasthuri Shankar Debate Video Viral: లైవ్‌లో లంచ్ చేస్తూ కనిపించిన నటి కస్తూరి.. వీడియో వైరల్!
X
Kasthuri Shankar (File Photo)

Actress Kasthuri Shankar Debate with Video Viral: కరోనా నేపధ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇంట్లో నుంచే పలు ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా సినీ నటీ కస్తూరి( భారతీయుడు, అన్నమయ్య సినిమాల హీరోయిన్) ఇటీవల, రిపబ్లిక్ ఛానల్ హోస్ట్ అర్నాబ్ గోస్వామి నిర్వహించిన ప్రత్యక్ష చర్చలో పాల్గొంది. అయితే అందులో అర్నబ్‌ మాట్లాడే సమయంలో లైవ్ లో నటీ కస్తూరి తింటూ కనిపించారు. లైవ్ లో అర్నాబ్ చర్చకి సంబంధించి బిగ్గరగా అరుస్తున్నప్పటికీ, ఆమె చాలా సాధారణంగా భోజనం చేస్తూ కనిపించడం ఫన్నీగా మారింది.

అయితే ఈ వీడియోని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ మహిళకు ఉన్న కాన్ఫిడెన్స్‌ నాకు కూడా కావాలి అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫైనల్ గా దీనిపైన కస్తూరి స్పందించింది. కాన్ఫిడెన్స్‌తో మనం ఏం చేయలేము. అర్నబ్‌ హైపర్‌మోడ్‌లో ఉండటాన్ని 60 నిమిషాలు గమనించా. ఆయన నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. అందుకే నేను లంచ్ చేశాను. కాకపోతే ఆ సమయంలో నేను స్కైప్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నానని, ఇది ఎవ్వరినీ కించపరచాలని కాదు అంటూ ఆమె పేర్కొన్నారు.

ఇక కస్తూరి సినిమాల విషయానికి వచ్చేసరికి 90 వ దశకంలో ప్రసిద్ధ కథానాయికలలో ఒకరైన నటి కస్తూరి శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు, అన్నమయ్య మొదలగు చిత్రాలలో నటించింది. కస్తూరి తమిళం , తెలుగు , మలయాళం మరియు కన్నడ భాషాలలో కలిపి వందకి పైగానే చిత్రాలలో నటించింది. ఇక గతంలోనూ తమిళ్ బిగ్ బాస్ లో ఆమె పాల్గొంది. ప్రస్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి అనే సీరియల్ లో మెయిన్ లీడ్ లో యాక్ట్ చేస్తుంది.



Krishna

Krishna

Next Story