ఆఫీషియల్ : అక్టోబర్ 30 న కాజల్ పెళ్లి!

Kajal Aggarwal Marriage : ప్రముఖ బిజినెస్ మెన్ తో నటి కాజల్ పెళ్లి అంటూ మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ వార్తల్లో నిలిచింది కాజల్..

Krishna
Published on: 6 Oct 2020 1:08 PM IST
ఆఫీషియల్ : అక్టోబర్ 30 న కాజల్ పెళ్లి!
X

Kajal Aggarwal announced her marriage

Kajal Aggarwal Marriage : ప్రముఖ బిజినెస్ మెన్ తో నటి కాజల్ పెళ్లి అంటూ మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ వార్తల్లో నిలిచింది కాజల్.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30న ముంబైలో వివాహం చేసుకోబోతున్నట్లు ట్విటర్‌లో కాసేపటి క్రితం స్వయంగా ప్రకటించింది. కరోనా నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఉంటుందని కాజల్ తెలిపింది. పెళ్లయినప్పటికి నటిగా కొనసాగుతానని, తనను ఇంతకాలం ఆదరిస్తూ వస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది కాజల్..

కాజల్ పెళ్లి అని తెలియడంతో సినీ స్టార్స్, అభిమానులు ఆమెకి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ముంబయిలోని ప్రఖ్యాత ఏడునక్షత్రాల హోటల్‌లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఇక గౌతమ్‌ ముంబైకి చెందిన వ్యాపారవేత్త కాగా, కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదువుకున్నట్లుగా సమాచారం.. ప్రస్తుతం డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను స్థాపించి నడుపుతున్నారని తెలుస్తోంది.



అటు కాజల్ అగర్వాల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం కమల్‌ హాసన్‌,శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న 'భారతీయుడు 2'లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా దుల్కర్‌ సల్మాన్‌, అదితిరావు హైదరి జంటగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక తెలుగులో చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది కాజల్.. ఈ సినిమాలు కరోనా వలన వాయిదా పడ్డాయి.

Krishna

Krishna

Next Story