కాబోయే భర్తతో కాజల్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్

అందాల చందమామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.. బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం అక్టోబర్ 30న జరగనుంది. ప్రస్తుతం పెళ్ళి పనుల్లో కాజల్ బిజీగా ఉంది.

Krishna
Published on: 27 Oct 2020 2:54 PM IST
కాబోయే భర్తతో కాజల్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్
X

అందాల చందమామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.. బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం అక్టోబర్ 30న జరగనుంది. ప్రస్తుతం పెళ్ళి పనుల్లో కాజల్ బిజీగా ఉంది. తాజాగా తనకి కాబోయే భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా ఈ ఫొటోలకి 1 మిలియన్ లైక్స్ వ్యూస్ రావడం విశేషం..

ఇక కాజల్ గౌతమ్‌తో దిగిన ఫోటో పోస్ట్ చేసి నీకు దసరా శుభాకాంక్షలు గౌతమ్ కిచ్లు అంటూ రాసుకొచ్చింది .. ఇక చిన్నప్పటి నుంచి కూడా కాజల్, గౌతమ్ మంచి స్నేహితులు కావడం విశేషం.. అలా వీరి మధ్య స్నేహం ప్రేమకు దారీ తీసింది. ఇద్దరి ప్రేమకి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒకే చెప్పడంతో వీరు త్వరలోనే ఒకటి కాబోతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న క్రమంలో కాజల్ వివాహం చేసుకుంటుంది.

ప్రస్తుతం కాజల్ మంచు విష్ణు మోసగాళ్ళు, చిరంజీవి ఆచార్య, కమల్ హసన్ ఇండియన్ 2, పారిస్ పారిస్‌ లాంటి సినిమాలను చేస్తోంది. ఇక పెళ్లి అయినప్పటికీ తానూ సినిమాలను చేస్తానని కాజల్ ఇప్పటికే ప్రకటించింది.

View this post on Instagram

Happy Dussehra from us to you ! @kitchlug #kajgautkitched

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on


Krishna

Krishna

Next Story