Kajal Agarwal Acharya Movie: ఆచార్య షూటింగ్ కి రెడీ అంటున్న కాజల్..

కొత్త పెళ్లికూతురు కాజల్ అగర్వాల్ అందరికీ షాక్‌ ఇచ్చింది. పెళ్లి చేసుకొని సినిమాలకు కొంత విరామం ఇస్తుందనుకున్న వారికి ఓ రేంజ్‌లో ఆన్సర్‌ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి ప్రారంభంకానున్న ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు వెల్లడించింది

Krishna
Updated on: 5 Nov 2020 5:14 PM IST
Kajal Agarwal Acharya Movie: ఆచార్య షూటింగ్ కి రెడీ అంటున్న కాజల్..
X

Kajal Agarwal Joins Acharya Movie Shooting : కొత్త పెళ్లికూతురు కాజల్ అగర్వాల్ అందరికీ షాక్‌ ఇచ్చింది. పెళ్లి చేసుకొని సినిమాలకు కొంత విరామం ఇస్తుందనుకున్న వారికి ఓ రేంజ్‌లో ఆన్సర్‌ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి ప్రారంభంకానున్న ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు వెల్లడించింది ఈ అందాల చందమామ.. అంతేకాదు.. తన స్నేహితులకు ఇక్కడే ఓ పార్టీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు మరికొంత సమయం పడుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో ఈ 'ఆచార్య' సినిమా తెరకెక్కుతుంది. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది.

Krishna

Krishna

Next Story