'చంద్రముఖి2'పై క్లారిటీ ఇచ్చిన జ్యోతిక

చంద్రముఖి2పై క్లారిటీ ఇచ్చిన జ్యోతిక
x
Jyothika(File Photo)
Highlights

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో విడుదలైంది. తమిళ్ , తెలుగు అని తేడా లేకుండా అన్ని చోట్ల బాగా ఆడింది ఈ సినిమా.. ఇక తమిళనాడులోని శాంతి థియేటర్‌లో 890 రోజులపాటు ఆడి రికార్డును నెలకోల్పింది. ఈ సినిమాని ఇప్పటికి టీవీలో వచ్చిన ప్రేక్షకులు చూస్తురంటే అర్ధం చేసుకోవచ్చు

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..దీనికి కూడా పీ వాసునే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్ర్కిప్ట్‌ జరుగుతుండగా, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. రజినీకాంత్ తో పాటు ప్రముఖ దర్శకుడు లారెన్స్ కూడా ఇందులో నటించనున్నాడు. అయితే ఇందులో జ్యోతిక కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపైన తాజాగా జ్యోతిక స్పందించింది. సీక్వెల్‌ కోసం తనని ఎవరూ సంప్రదించలేదని, అసలు ఆ ప్రాజెక్టు గురించే తనకు తెలియదని చెప్పుకొచ్చింది.

ఇక చంద్రముఖి సినిమా కథ విషయానికి వస్తే వెంకటపతి అనే రాజుకి తాను కోరుకున్నది దక్కి తీరాల్సిందే అనే స్వభావం కలవాడు. ఈ నేపధ్యంలో తన రాజ్యంలో నాట్యం చేసేందుకు వచ్చిన గుణశేఖర్ ని చంద్రముఖి కళ్ళముందే చంపేస్తాడు ఆ వెంకటపతి రాజు. దీనితో ఆ వెంకటపతి రాజుపై పగ పెంచుకున్న చంద్రముఖి అతన్ని ఎలాగైనా అంతం చేయాలనీ ఓ ఆత్మ రూపంలో ఆ ఇంట్లోనే ఉంటుంది. మరి ఆమె పగ ఎలా తీరింది. అందులో రజినీ పాత్ర అంటి అన్నది ఇతివృత్తం..ఈ సినిమాని హర్రర్, కామెడీతో చాలా బాగా హండిల్ చేశాడు వాసు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories