రాజశేఖర్ కోలుకుంటున్నారు : జీవిత

హీరో రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన సతీమణి జీవిత తెలిపారు. రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ జరుగుతోన్న వార్తల్లో నిజం లేదన్న జీవిత.... అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. రాజశేఖర్ క్రమంగా కోలుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటికి వస్తారని జీవిత తెలిపారు.

admin
Updated on: 22 Oct 2020 8:44 PM IST
రాజశేఖర్ కోలుకుంటున్నారు :  జీవిత
X

హీరో రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన సతీమణి జీవిత తెలిపారు. రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ జరుగుతోన్న వార్తల్లో నిజం లేదన్న జీవిత. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. రాజశేఖర్ క్రమంగా కోలుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటికి వస్తారని జీవిత తెలిపారు. కరోనా వైరస్ బారినపడిన రాజశేఖర్ కొద్దిరోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నారని, ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ ప్రచారం జరిగింది. దాంతో, జీవిత అండ్ ఫ్యామిలీ మీడియాకి క్లారిటీ ఇచ్చారు. రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు.అటు రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారని రాజశేఖర్ ఇటీవల తెలిపారు.

admin

admin

Next Story