Janhvi Kapoor: ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను.. జాన్వీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..!

Janhvi Kapoor: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దాదాపు 6 ఏళ్ల తర్వాత తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జాన్వీకపూర్‌.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 July 2024 2:44 PM IST
Actress Janhvi Kapoor Interesting Comments About NTR Dance
X

Janhvi Kapoor: ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను.. జాన్వీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..!

Janhvi Kapoor: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దాదాపు 6 ఏళ్ల తర్వాత తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జాన్వీకపూర్‌. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర సినిమా ద్వారా తొలిసారి టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోందీ బ్యూటీ. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ తన కొత్త చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ ఇంటర్వ్యూలోనే పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

దేవర చిత్రంలో ఎన్టీఆర్‌తో నటించడంపై జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు తారక్‌తో డ్యాన్స్‌ చేయడం అంటే ఎంతో ఇష్టమని చెబుతోంది జాన్వీ. ఇంటర్వ్యూలో భాగంగా అమితాబ్‌ బచ్చన్‌, హృతిక్‌ రోషన్‌, విక్కీ కౌశల్‌ వీరిలో ఎవరితో డ్యాన్స్‌ చేయాలని ఉందని ప్రశ్నతించగా తనకు ఎన్టీఆర్‌తో డ్యాన్స్‌ చేయాలని ఉందని ఠక్కున చెప్పేసింది. డ్యాన్స్‌ విషయంలో ఎన్టీఆర్‌ది అందె వేసిన చేయి అని తెలిసిందే. తాజాగా జాన్వీ చేసిన కామెంట్స్‌ సైతం ఎన్టీఆర్‌ డ్యాన్సింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ విషయమై జాన్వీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ‘దేవర’లో నటిస్తున్నాను. ఎన్టీఆర్‌తో కలిసి ఓ పాట షూటింగ్‌ పూర్తయింది. తర్వాత పాటను ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. కాగా ఆచార్య వంటి ఫ్లాప్‌ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవరపై భారీగా అంచనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సైఫ్‌ అలీఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. సెప్టెంబర్‌ 27వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. మరి భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమాఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story