Hema: నరేష్‌ హాయిగా కూర్చొని అకౌంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు

* రూ.5 కోట్ల నిధులలో రూ.3 కోట్లు ఖర్చు చేశారు -హేమ * టాలీవుడ్‌ సర్కిల్‌లో హేమ వాయిస్ రికార్డు చక్కర్లు

Sandeep Reddy
Updated on: 7 Aug 2021 12:51 PM IST
Actress Hema Shocking Comments on MAA President Naresh About The Elections And Funds of MAA
X

హేమ - నరేష్ (ఫైల్ ఫోటో)

Hema Comments: "మా" అధ్యక్షుడు నరేష్‌పై నటి హేమ మండిపడ్డారు. తోటి నటులకు హేమ పంపిన వాయిస్‌ రికార్డు టాలీవుడ్‌ సర్కిల్‌లో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. "మా" ఎన్నికలు వెంటనే నిర్వహించాలనే డిమాండ్‌తో నరేష్‌పై పలు విమర్శలు చేసింది హేమ. ఎన్నికలు జరగకూడదని, నరేష్‌ అధ్యక్షుడిగా కొనసాగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని వాయిస్‌ రికార్డులో హేమ తెలిపారు. ఇంతవరకు మా అసోసియేషన్‌ రూపాయి సంపాదించకపోగా ఉన్న 5 కోట్ల నిధులను నరేష్‌ 2 కోట్లకు తీసుకొచ్చారని 3కోట్లు వృధాగా ఖర్చు చేశారంటూ ఆరోపించారు.

గతంలో ఆఫీస్‌ ఖర్చు బయటి నుంచి తీసుకువచ్చి ఇచ్చేవాళ్లమని, కానీ నరేష్‌ హాయిగా కూర్చొని అకౌంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు హేమ.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story