Hema: నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను.. నాకు బెంగళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు..

Actress Hema Respond on Bengaluru Rave Party
x

Hema: నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను.. నాకు బెంగళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు..

Highlights

Rave Party Busted in Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ పోలీసుల దాడి చేశారు.

Rave Party Busted in Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ పోలీసుల దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 100 మందికి పైగా యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు చెప్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్కులేట్ అవుతోంది. దీనిపై వెంటనే సినీ నటి హేమ స్పందించారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను… నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదని వెల్లడించారు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories