Hema: నువ్వు హాట్‌ అన్న నెటిజన్.. ఫన్నీగా బదులిచ్చిన హేమ‌

Hema Instagram live Comments
x
Hema File photo
Highlights

Hema: తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్ర‌త్యేక గుర్తింపు పొందిన న‌టి హేమ‌.

Hema: తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్ర‌త్యేక గుర్తింపు పొందిన న‌టి హేమ‌. ఎన్నో సినిమాల్లో హీరోహీరోయిన్ల‌కు అక్క‌గా, అమ్మ‌గా, ఎన్నో గొప్ప పాత్ర‌లు పోషించారు. తెలుగు , తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించిన హేమ. ఇటీవ‌లే వ‌చ్చిన ఉప్పెన సినిమాలో హేమ పాత్ర‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే హేమ సినిమాల్లో క‌నిపించ‌డం కాస్త త‌గ్గించినా.. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. త‌న‌కు సంబంధించిన అన్ని అప్ డేట్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో షేర్ చేసుకుంటారు.

ఇక తాజాగా కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కు వెళ్లిన హేమ..అక్కడే ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. లైవ్‌ చాట్‌లో కరోనాపై జాగ్రత్తలు చెబుతూ కొవిడ్ రెండో ద‌శ చాలా తీవ్రంగా ఉందని అందరూ మాస్కులు ధరించాలని కోరింది. కూతురితో కలిసి చింత చిగురు కోసిన నటి..తనకన్నా తన కూతురే ఫేమస్‌ అని, సోషల్‌ మీడియాలో తనకంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారని చెప్పుకొచ్చిది.

అయితే అంతా బాగానే ఉంది. సినీతార‌ల‌కి ఎప్పుడు ఎదురైయ్యే స‌మ‌స్యే హేమ‌కు వ‌చ్చింది. లైవ్‌లోనే ఓ నెటిజన్‌ హేమను హాట్‌ అంటూ కామెంట్‌ చేశాడు. దీనిపై స్పందించిన హేమ సీరియ‌స్ గా తీసుకుంటుద‌ని అంతా భావించారు. అయితే హేమ మాత్రం త‌న‌లోని హాస్య చ‌తుర‌త‌ను బ‌య‌ట పెట్టింది. ఆ నెటిజ‌న్ కి ఫ‌న్నీగా రిప్లై ఇచ్చింది. 'నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్నా. ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్‌గా కనిపిస్తున్నానా' అంటూ ఫన్నీగా బదులిచ్చింది. ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గతంలో బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని మొదటి వారమే ఎలిమినేట్‌ అయి హౌస్‌ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories