Actress Hema: పబ్‌లో నేను లేను.. నన్నెందుకు బద్నాం చేస్తున్నారు..

Actress Hema: బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో కొన్ని రకాల డ్రగ్స్‌ బయటపడ్డాయి.

Arun Chilukuri
Published on: 3 April 2022 2:01 PM IST
Actress Hema Clarifies on pub Raids
X

Actress Hema: పబ్‌లో నేను లేను.. నన్నెందుకు బద్నాం చేస్తున్నారు..

Actress Hema: బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో కొన్ని రకాల డ్రగ్స్‌ బయటపడ్డాయి. ముందుగానే సమాచారం ఉండటంతో టాస్క్‌పోర్స్‌ పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. తెల్లవారు జామున 3గంటల సమయంలో జరిగిన ఈ దాడుల్లో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కూడా ఉన్నారు. పట్టుబడ్డవారిలో ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 150 మంది యువతీయువకులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ కేసుతో తనకు సంబంధం లేకపోయినప్పటికీ తన పేరుని పలు ఛానళ్లల్లో ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి అవాస్తవాలు ప్రసారం చేస్తోన్న సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆదివారం మధ్యాహ్నం ఆమె బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు నటి హేమ. ఇంత పెద్ద కేసులో తన పేరును ఇన్వాల్స్ చేసి.. బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళపై ఈ విధమైన ప్రచారం సరికాదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story