Hari Teja: డెలివరీ టైంలో ఒంటరినయ్యానంటూ హరితేజ ఎమోషనల్ వీడియో..

Hari Teja: ప్రముఖ నటి, యాంకర్‌ హరితేజకు ఏప్రిల్ 5న పండంటి ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 28 April 2021 11:31 PM IST
Actress Hari Teja Emotional Video
X

హరితేజ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Hari Teja: ప్రముఖ నటి, యాంకర్‌ హరితేజకు ఏప్రిల్ 5న పండంటి ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే. ఈమేరకు తమ చిన్నారి ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. అనంతరం ఓ ఎమోషనల్ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. డెలివీర టైంలో తను పడిన కష్టాలను వివరిస్తూ... ఆటైంలో నేను ఒంటరిగా మారిపోయానని చాలా ఎమోషనల్ అయింది.

ఈ వీడియోలో ఏముందంటే.. 'పాప పుట్టిందని తెలియగానే చాలా మంది శుభకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరికి రిప్లై చేసే పరిస్థితుల్లో అప్పుడు లేను. ఇప్పడు చెప్పుతున్న మీ అందరికి థ్యాంక్స్‌. అప్పుడు ఎందుకు రిప్లై ఇవ్వలేదో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. నా డెలివరీకి ఒక్క వారం ముందు ఇంట్లో అందరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాకు కూడా పాజిటివ్‌ వచ్చింది. ఏం చేయలో నాకు అర్థం కాలేదు. నేను ఎక్కువ జాగ్రత్తగా లేకపోవడం వల్లే ఇలా అయిందని అనిపించిందని' ఆమె పేర్కొంది.

అలాగే 'అప్పుడు నేను చాలా ఇబ్బందికి గురయ్యా. రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్లే డాక్టర్లు డెలివరీ చేయమని చెప్పారు. దాంతో కోవిడ్‌ ఆస్పత్రులను సంప్రదించా. నాకు పాజిటివ్‌ కాబట్టి బేబీకి కూడా వస్తుందని భయపడ్డాను. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను. డెలివరీ అంటే సంతోషంగా ఉంటుంది. డెలివరీ టైంలో ఒక్కదాన్నే పోరాడాను. దీపు ఒక్కడే చూసుకున్నాడు. కోవిడ్‌ వార్డులో ఒక్కదాన్నే ఉన్నాను. బేబీ పుట్టగానే నా దగ్గర నుంచి తీసుకెళ్లారు. పాపని వీడియో కాల్‌లో చూడాల్సి వచ్చింది. చాలా బాధను అనుభవించాను. మా వాళ్లు అంతా ఐసోలేషన్‌లో ఉన్నారు'అంటూ హరితేజ విజ్ఞప్తి చేసింది.


Venkata Chari

Venkata Chari

Next Story