Tollywood: వెంక‌టేష్‌తో న‌టించాల‌నే కోరికను బయటపెట్టిన సీనియ‌ర్ హీరోయిన్

Dia Mirza Says To Act venkatesh
x

దియా మీర్జా ఫైల్ ఫోటో 

Highlights

Tollywood: టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరు వెంకటేశ్. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస విజయాలతో విక్టరినే ఇంటిపేరుగా మార్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్.

Tollywood: టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరు వెంకటేశ్. ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస విజయాలతో విక్టరినే ఇంటిపేరుగా మార్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో నుంచి అరంగేట్రం చేసినా.. సొంత టాలెంట్ తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వెంకటేష్ తో నటించడానికి హీరోయిన్లు పోటీపడేవారు. ఈ తరంలోనూ వెంకటేష్ ఇమేజ్ అలానే కొనసాగుతోంది. ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో దూసుపోతున్నారు. నారప్ప, దృశ్యం-2 సినిమాలతో బీజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

వెంకటేష్ సరసన నటించాలనే కోరిక ఉందని సినీయర్ హీరోయిన్ తన మనసులోని మాటను బాయట పెట్టింది. ఆమె ఎవరో కాదు దియా మీర్జా.. ఈ త‌రం హీరోయిన్ కాదు. ఎప్పుడో వ‌చ్చిన 'ల‌గేర‌హో మున్నాభాయ్' స‌మ‌యానికే పెద్ద ప్రాధాన్యం లేని సెకెండ్ హీరోయిన్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించింది. అది జ‌రిగి కూడా దాదాపు ద‌శాబ్దంన్న‌ర అవుతోంది. ఇలాంటి త‌రుణంలో ఈమెకు అనూహ్యంగా ఒక తెలుగు సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది.

అక్కినేని నాగార్జున స‌ర‌స‌న వైల్డ్ డాగ్ లో న‌టించింది. ఈ సందర్బంగా సినిమా ప్రమోషన్లతో బీజీగా ఉన్న ఈమె తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో త‌న‌కు ఇష్ట‌మైన హీరోలు నాగార్జున‌, వెంక‌టేష్ అని పేర్కొంది. ఇది కొత్త చెప్పే మాట కాదని గతంలో తన పాత ఇంట‌ర్వ్యూల‌ను చూసినా అభిమాన హీరోలుగా నాగార్జున‌, వెంక‌టేష్ పేర్ల‌నే చెప్పిన‌ట్టుగా దియా ఇప్పుడు చెబుతోంది.అలాంటి త‌న అభిమాన హీరోల్లో నాగర్జున స‌ర‌స‌న ఇప్పుడు న‌టించినందుకు స‌గం హ్యాపీగా ఉంద‌ని దియా చెబుతోంది.

నాగార్జున తో న‌టించ‌డం త‌న‌కు స‌గం సంతోషాన్ని ఇస్తోంద‌ని, ఇక వెంక‌టేష్ తో న‌టిస్తే మ‌రింత హ్యాపీ అని దియా ప్ర‌క‌టించుకుంది. నాగార్జున ఫ్యామిలీ త‌మ ఫ్యామిలీకి చాలా కాలంగా ప‌రిచ‌యం ఉంద‌ని దియా చెబుతోంది. నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ దియ‌ చిన్న‌ప్ప‌టి స్నేహితురాలట‌‌. ఆ అనుబంధం అలాగే కొన‌సాగుతూ వచ్చింద‌ని దియ చెబుతోంది. ఇటీవలి కాలంలో వెంకటేష్ భిన్న చిత్రాలతో దూసుకుపోతున్నారు. అయితే వెంకటేశ్ సరసన ఈతరం హీరోయిన్లు నటించడం కష్టం కాబట్టి.. ఈ ముదురు భామకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం దియా మీర్జా, నాగార్జున ప్రధాన పాత్రలో 'వైల్డ్‌ డాగ్'చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సయామీ ఖేర్‌, అలీరెజా, అతుల్‌ కులకర్ణి వంటి నటులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలకానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories