నటి ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

Arun Chilukuri
Published on: 15 Dec 2020 1:27 PM IST
నటి ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు
X

తమిళ సీరియల్ నటి చిత్ర ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో వ్యాపారవేత్త హేమంత్ ను అరెస్టు చేశారు. ఆరునెలల క్రితమే చిత్ర, హేమంత్‌కు నిశ్చితార్థం జరిగింది. గతంలోనే వీరిద్దరు రిజిస్ట్రర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే, జనవరి 14న ఘనంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 9న షూటింగ్ పూర్తి అయిన తర్వాత.. చెన్నై నజరత్‌పేటలోని ఓ హోటల్‌లో హేమంత్ తో కలిసి బస చేసింది చిత్ర. అదే రోజు రాత్రి చిత్ర ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించిన పోలీసులు తాజాగా హేమంత్ ను అరెస్టు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story