Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నటి చార్మీ

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై ఈడీ విచారణ

Sandeep Eggoju
Updated on: 2 Sept 2021 11:58 AM IST
Actress Charmy Attended to ED investigation on Tollywood Drugs Case
X
డ్రగ్స్ కేసు విచారణంకు హాజరు అయిన ఛార్మి (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs Case: టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు విచారణకు నటి, నిర్మాత ఛార్మి హాజరయ్యారు. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్ సెలబ్రిటీస్‌‌ 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 31న దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను కీలక విషయాలపై 10 గంటలపాటు ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం ఛార్మీ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత, ప్రొడెక్షన్‌ హౌస్‌కు సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story