Paagal Movie: సీనియర్ బ్యూటీ తో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న "పాగల్" టీమ్

Paagal Movie: హిట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తాజాగా ‘పాగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

admin1
Published on: 11 Aug 2021 1:30 PM IST
Actress Bhumika Chawla Plays a Main Role in Pagal Movie
X

పాగల్ మూవీ పోస్టర్ 

Paagal Movie: హిట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ సేన్ తాజాగా 'పాగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నివేదా పెతురాజ్, సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 14 న విడుదలకు సిద్ధమైంది. సినిమాకి సంబందించిన పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్ర బృందం ఈమధ్యనే సినిమా ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. 1600 అమ్మాయిలను ప్రేమించిన ఒక కుర్రాడు నిజంగా ఒక అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే దాని చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ బ్యూటీ భూమిక చావ్లా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈమె పాత్ర ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ గా ఉండబోతుందట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. నరేశ్ కుప్పిలి దర్వకత్వంలో నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌ధ‌న్ సంగీతాన్నిఅందిస్తోన్న'పాగల్' చిత్రానికి ఎస్‌. మ‌ణికంద‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా పనిచేస్తున్నారు.

admin1

admin1

Next Story