Anjali: ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగు హీరోయిన్

Anjali: 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్న తెలుగమ్మాయి

admin1
Updated on: 8 Sept 2021 12:15 PM IST
Actress Anjali Completed 15 Years in Telugu Film Industry
X
హీరోయిన్ అంజలి (ఫైల్ ఇమేజ్)

Anjali: ఇంత పెద్ద తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు మాత్రం తక్కువగానే ఉంటారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా మారిన తెలుగు అమ్మాయిలను మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి తెలుగు అమ్మాయిల లో అంజలి పేరు ముందే ఉంటుంది. "ఫోటో" సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళ్లో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. "సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు", "బలుపు", "జర్నీ", "గీతాంజలి" వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

తమిళంలో ఒక స్టార్ దర్శకుడితో వివాదాల్లో ఇరుక్కోవడం అంజలి కెరియర్ ను బాగా దెబ్బతీసిందని చెప్పుకోవాలి. ఇటు తెలుగులో అంజలికి ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. అటు తమిళంలో అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేని పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ అపుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది ఈ భామ. అయితే మిగతా తెలుగు అమ్మాయిల తో పోలిస్తే అంజలి ఇండస్ట్రీలో గత 15 ఏళ్ల నుంచి నెట్టుకొస్తోంది. ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయి ఇన్నాళ్లు ఇండస్ట్రీ లో ఉండటం అంటే గొప్ప విషయమే. తాజాగా ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

admin1

admin1

Next Story