Actress Anjali: అంజలి ఆస్తులు తగ్గడానికి కారణం అదేనా..?

Actress Anjali: ఒకవైపు తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా అంజలి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.

Arun Chilukuri
Published on: 29 Aug 2022 4:22 PM IST
Actress Anjali Assets Details Trending in Internet
X

Actress Anjali: అంజలి ఆస్తులు తగ్గడానికి కారణం అదేనా..?

Actress Anjali: ఒకవైపు తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా అంజలి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో కూడా ఈమె నటించినా చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఈ మధ్యకాలంలో అంజలి కి హీరోయిన్ ఆఫర్లు బాగా తగ్గిపోవడంతో ఈమె స్పెషల్ సాంగ్ ల్లో నటించేందుకు కూడా ఆసక్తి చూపిస్తోంది. గత 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఈమె పెద్దగా ఆస్తులు ఏమి సంపాదించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

చెన్నై మరియు హైదరాబాదులో కలిపినా కూడా అంజలి ఆస్తి విలువ 10 కోట్లకు మించి ఉండదని సమాచారం. అయితే ఆఫర్లు బాగా తగ్గిపోవడం వల్లే అంజలి ఆస్తులు పెద్దగా పెరగలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు సినిమాలతో కంటే విషయాలను అంజలి ఈ మధ్య వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తుంది.

ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆస్తి విషయంలో మోసం చేశారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంజలి చాలా వరకు ఆస్తులను పోగొట్టుకుందని కొందరు చెబుతున్నారు. మరి ఈ స్పెషల్ సాంగ్ లు, స్పెషల్ పాత్రలలో నటిస్తూ అంజలి ఎంతవరకు సంపాదిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఒక్కో సినిమాకి అంజలి దాదాపు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story