Anasuya: నా డ్రస్‌ నా ఇష్టం, అడగడానికి మీరెవ్వరు.. అనసూయ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Anasuya Bharadwaj
x

Anasuya Bharadwaj

Highlights

Anasuya Bharadwaj: ఒక సాధారణ యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి సినిమాల్లో నటించే స్థాయికి చేరుకుంది అనసూయ.

Anasuya Bharadwaj: ఒక సాధారణ యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి సినిమాల్లో నటించే స్థాయికి చేరుకుంది అనసూయ. కెరీర్‌ మొదలు పెట్టిన చాలా ఏళ్ల తర్వాత అనసూయ గ్రాఫ్‌ ఒక్కసారిగా మారింది. వరుస టీవీ షోలతో పాటు, సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ ఓరియెంట్‌ మూవీస్‌లో లీడ్‌ రోల్‌లో కూడి నటించి మెప్పించింది అనసూయ. ఇక కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ, సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

తన కెరీర్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. అయితే ఇదే సమయంలో అనసూయ నెట్టింట ట్రోలింగ్ ఎదుర్కొన్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా అనసూయ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే కొన్ని ఫొటోలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సందర్భాలు ఉన్నాయి. ధరించే డ్రస్‌ విషయంలో అనసూయ పలు సార్లు ట్రోలింగ్‌కు గురైంది.

బికినీలో ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సమయంలో అనసూయపై కొందరు నెగిటివ్‌ కామెంట్స్‌ చేశారు. అయితే దీని గురించి పెద్దగా పట్టించుకోని అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌ అయ్యింది. తన డ్రస్‌ విషయంలో జరిగే ట్రోలింగ్‌పై తనదైన శైలిలో స్పందించింది. ట్రోలర్స్‌కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తన డ్రస్సింగ్‌పై పనిగట్టుకొని కామెంట్ చేసే వారిపై ఓ రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా దుస్తులు నా ఇష్టం. బికినీ వేసుకుంటా.. మరేదైనా వేసుకుంటా. అది నా ఇష్టం.. అడగడానికి మీరెవ్వరు' అంటూ ఫైర్ అయ్యింది. అయితే అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. కొందరు అనసూయకు మద్ధతు ఇస్తుంటే మరికొందరు మాత్రం నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories