Ameesha Patel: చెక్ బౌన్స్ కేసులో కోర్టులో లొంగిపోయిన నటి అమీషా పటేల్..

Ameesha Patel: ముఖానికి ముసుగేసుకుని కోర్టు నుంచి బయటకు

Jyothi
Published on: 18 Jun 2023 11:57 AM IST
Actress Ameesha Patel surrenders before Ranchi court in cheque bounce case
X

Ameesha Patel: చెక్ బౌన్స్ కేసులో కోర్టులో లొంగిపోయిన నటి అమీషా పటేల్..

Ameesha Patel: ప్రముఖ హీరోయిన్ అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో రాంచి సివిల్ కోర్టులో లొంగిపోయారు. సినీ నిర్మాత, వ్యాపారవేత్త అజయ్ కుమార్.. అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు వేశారు. సినిమా నిర్మిస్తానంటూ అమీషా తన దగ్గర రెండున్నర కోట్లు అప్పుగా తీసుకుని, ఆ తర్వాత ఆమె సినిమా పూర్తిచేయలేదన్నది అజయ్ కుమార్ కంప్లయింట్. సినిమా పేరుతో తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని అజయ్‌కుమార్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు. అసలు రెండున్నర కోట్లకు వడ్డీ మరో 50 లక్షలు కలిపి మొత్తం 3 కోట్ల రూపాయలు ఇప్పించాలని ఆయన కోర్టును కోరాడు.

ఈ చెక్ బౌన్స్ కేసులో విచారణ చేపట్టిన రాంచి సివిల్ కోర్టు ఏప్రిల్‌ 6న అమీషాకు వారెంట్‌ ఇష్యూ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టులో లొంగిపోయింది. అనంతరం కోర్టు ఆమె షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దాంతో కోర్టు బయటికి వచ్చిన మీడియాను చూసి తలకు ముసుగు కప్పుకుంది. కోర్టులో ఏం జరిగిందో చెప్పమని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించినా ఆమె పట్టించుకోకుండా కారులో వెళ్లిపోయింది.

Jyothi

Jyothi

Next Story