ఏకంగా ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్య రాజేశ్‌?

ఏకంగా ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన  ఐశ్వర్య రాజేశ్‌?
x
Highlights

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. మొదటిసారిగా అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. మొదటిసారిగా అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.

అయితే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌‌ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఇందులో ఆమెను ఓ కీలక పాత్ర కోసం అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో ఆమె ఎన్టీఆర్ సరసన నటించనుందట.. కొమరం భీమ్‌ను ప్రేమించే ఓ గిరిజన యువతి పాత్రగా ఆమె తెరపైన కనిపించనుందట.. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికి సినిమాలో ఎంతో కీలకమని సమాచారం.. దీనిపైన త్వరలో ఓ అధికార ప్రకటన వెలువడనుంది. అటు వరల్డ్ ఫేమస్ లవర్ తో పాటుగా మొదలగు చిత్రాలతో నటిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది ఐశ్వర్య రాజేశ్‌..

అటు లాక్ డౌన్ వలన వాయిదా పడిన RRR మూవీ తాజాగా మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories